Lata Mangeshkar: లతా దీదీ లేరంటే గుండె పగిలినట్లుంది: చిరంజీవి

భారతరత్న లతా మంగేష్కర్‌ మృతిపట్ల ప్రముఖ సినీనటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

Updated : 06 Feb 2022 13:36 IST

హైదరాబాద్‌: భారతరత్న లతా మంగేష్కర్‌ మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీరంగానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.

‘‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా, గొప్ప లెజెండ్‌లలో ఒకరైన లతా దీదీ ఇక లేరంటే గుండె పగిలినట్లు ఉంది. లతా మంగేష్కర్‌ అసాధారణ జీవితాన్ని గడిపారు. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’- చిరంజీవి, ప్రముఖ నటుడు


‘‘లత మృతి దేశానికే కాదు.. సంగీత ప్రపంచానికే తీరని లోటు. ఆమె పొందని అవార్డు.. రాని రివార్డు లేదు. విదేశాలు కూడా పురస్కారాలతో లతను గౌరవించాయి. లత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’-బాలకృష్ణ, ప్రముఖ నటుడు


‘‘లతాజీ మరణం తీరని లోటు. ఆమె ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉంటారు. భారతదేశపు నైటింగేల్‌కు నా హృదయపూర్వక నివాళి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను’’ - రాజమౌళి, ప్రముఖ దర్శకుడు


‘‘లతా మంగేష్కర్‌ మరణవార్త తీవ్రంగా కలచివేసింది. తరతరాలుగా భారతీయ సంగీతాన్ని నిర్వచించిన స్వరం ఆమెది. ఆమె సేవలు నిజంగా అసమానమైనవి. ఆమెలాంటి వారు మరొకరు రాబోరు. కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమె అభిమానులందరికీ సానుభూతి తెలుపుకొంటున్నా’’ - మహేశ్‌బాబు, ప్రముఖ నటుడు


‘‘లతా మంగేష్కర్‌ మృతి దేశానికి తీరనిలోటు. ఆమె మధురగాత్ర మహారాణి. ఎంతోమంది కొత్తతరం గాయకులకు లత స్ఫూర్తి ప్రదాత’’- ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని