Godfather: ‘గాడ్‌ఫాదర్‌’లో కీలకపాత్ర

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘గాడ్‌ఫాదర్‌’లో యువ కథానాయకుడు సత్యదేవ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆవిషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా..మోహన్‌రాజా

Updated : 29 Apr 2022 14:06 IST

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘గాడ్‌ఫాదర్‌’లో యువ కథానాయకుడు సత్యదేవ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆవిషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా..మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పకులు. ఈ సినిమాకి తారాగణం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సల్మాన్‌ఖాన్‌, నయనతార తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మాతృకలో వివేక్‌ ఒబెరాయ్‌ చేసిన పాత్రలోనే సత్యదేవ్‌ నటిస్తున్నారని తెలుస్తోంది. ఆయన ‘ఆచార్య’లోనూ ఓ కీలక పాత్ర పోషించారు. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు సత్యదేవ్‌. ఆ ట్వీట్‌పై చిరంజీవి ప్రతిస్పందించారు. ‘‘నీలాంటి చక్కటి నటుడు నా  అభిమాని కావడం చాలా సంతోషం. ఆచార్య’లో తక్కువ నిడివిగల పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. ‘గాడ్‌ఫాదర్‌’లో నా అభిమాని నాకు ఎదురు నిలబడే  పూర్తిస్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం’’ అంటూ ట్వీట్‌ చేశారు చిరంజీవి. రాజకీయం నేపథ్యంలో సాగే ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాకి నీరవ్‌ షా కెమెరా బాధ్యతలు  నిర్వర్తిసుండగా, తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని