Chiranjeevi: బన్నీ.. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది: చిరంజీవి
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)ను ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఐకాన్‌స్టార్‌గా బన్నీ ఎదిగిన తీరు తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
హైదరాబాద్: తన మేనల్లుడు, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభినందించారు. నటుడిగా బన్నీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు మెచ్చుకుంటూ చిరు తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. బన్నీ మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
‘‘డియర్ బన్నీ.. సినీ పరిశ్రమలో నువ్వు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నీ చిన్ననాటి రోజులు నా మదిలో ఇంకా అలాగే ఉన్నాయి.. సమయం ఎంతో వేగంగా గడిచిపోయింది కదా..! ఒక సాధారణ నటుడిగా అడుగుపెట్టి పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్‌గా నువ్వు ఎదగడం చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో నువ్వు మరెన్నో విజయాలు, ప్రేక్షకుల మన్ననలు అందుకోవాలని ఆశిస్తున్నా’’ అని చిరంజీవి (Chiranjeevi) పేర్కొన్నారు.
చిరంజీవి నటించిన ‘విజేత’, ‘డాడీ’ సినిమాల్లో బన్నీ బాలనటుడిగా కనిపించారు. ‘గంగోత్రి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ క్లాస్, మాస్ ప్రేక్షకులను అలరించే కథల్లో నటించారు. స్టైలిష్ స్టార్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించిన ఆయన 2021లో విడుదలైన ‘పుష్ప’ (Pushpa)తో ఐకాన్‌స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప-2’ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Wrestlers' protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు