Chiranjeevi: చిరు వీణ స్టెప్‌ చూశారు.. మరి పోతరాజు స్టెప్‌ చూశారా?

అలయ్‌ బలయ్‌లో చిరంజీవి పోతరాజు స్టెప్‌ వేసి అక్కడి వారిని అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Published : 08 Oct 2022 01:44 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్‌కు ఒక క్రేజ్‌ తీసుకొచ్చిన నటుడు చిరంజీవి. కేవలం డ్యాన్స్‌ మాత్రమే కాదు, దానికి కాస్త గ్రేస్‌ జోడించి స్టెప్‌లు వేయడం ఆయన ప్రత్యేకత. ఆ స్పెషాలిటీనే ఇతర నటుల నుంచి చిరును ప్రత్యేకంగా నిలిపింది. ఇప్పటివరకూ మీరు చిరంజీవి వేసిన ‘నడక కలిసిన నవరాత్రి’, ‘దాయిదాయి దామా’ వీణ స్టెప్‌ చూసి ఉంటారు. కానీ, తెలంగాణ సంప్రదాయమైన పోతరాజుల స్టెప్‌ వేయడం చూశారా?

దసరా సందర్భంగా హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ‘అలయ్‌ బలయ్‌’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈసారి చిరంజీవి కూడా హాజరై స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా చిరు పోతరాజు స్టెప్‌ వేసి అక్కడి వారిని అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దసరా సందర్భంగా ‘గాడ్‌ఫాదర్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts