Chiranjeevi: పుట్టినరోజు వేడుకలో సత్కారం
ఆస్కార్ (oscars 2023) గెలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) బృందాన్ని తన నివాసంలో ప్రత్యేకంగా సత్కరించారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి.
ఆస్కార్ (Oscars 2023) గెలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) బృందాన్ని తన నివాసంలో ప్రత్యేకంగా సత్కరించారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). ఆయన తనయుడు, చిత్ర కథానాయకుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా సోమవారం చిరంజీవి నివాసంలో వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున సహా పలువురు తారలు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరై చరణ్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, నిర్మాత డి.వి.వి.దానయ్య, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, నృత్య దర్శకుడు ప్రేమ్‌రక్షిత్, లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ తదితర చిత్రబృందాన్ని వేడుకలో శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు చిరంజీవి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే