
Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ విడుదల తేదీ ఫిక్స్ అయిందా?
ఇంటర్నెట్‌డెస్క్: చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం ప్రస్తుతం చర్చలు జరుపుతోందట. ప్రస్తుతం సల్మాన్-చిరులపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది అభిమానులను ప్రత్యేకంగా అలరించనుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోందట. అయితే, చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖసమర్పిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’‘(Lucifer) రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Dadisetti Raja: నచ్చకపోతే వాలంటీర్లను తీసేయండి: మంత్రి రాజా
-
Ap-top-news News
Andhra News: వైకాపాకు ఓటేసి తప్పు చేశాం.. చెప్పులతో కొట్టుకుంటూ నిరసన
-
Movies News
Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-07-2022)
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- రూ.19 వేల కోట్ల కోత
- బడి మాయమైంది!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-07-2022)