Chiranjeevi: అల్లూరి విగ్రహావిష్కరణ.. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం చేరుకుని, అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Published : 28 Jun 2022 20:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ (Azaadi ka Amrit Mahotsav)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) జులై 4న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం చేరుకుని, అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, సహకారం అందించాలంటూ కేంద్ర ప్రభుత్వం నటుడు చిరంజీవిని (Chiranjeevi) ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) చిరంజీవికి లేఖ రాశారు. ‘‘అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర సాంస్కృతిక శాఖ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి ఏడాదిపాటు (2023 జులై 4 వరకు) పలు రకాల కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ఈ వేడుకలకు మీ సహకారం, మద్దతు కావాలి’’ అని చిరంజీవిని కిషన్‌రెడ్డి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని