bhola shankar: జాం... జాం... జజ్జనక
‘భోళా శంకర్’గా సెట్స్‌పై తుది మెరుగులు దిద్దుకుంటున్నారు కథానాయకుడు చిరంజీవి. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. కీర్తి సురేష్, చిరు చెల్లిగా కనిపించనుంది.
‘భోళా శంకర్’గా సెట్స్‌పై తుది మెరుగులు దిద్దుకుంటున్నారు కథానాయకుడు చిరంజీవి. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. కీర్తి సురేష్, చిరు చెల్లిగా కనిపించనుంది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రీకరణను పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ప్రస్తుతం ఓ భారీ సెట్‌లో సంగీత్ సాంగ్ తెరకెక్కిస్తున్నట్లు చిరు లీక్ చేశారు. దీనికి సంబంధించిన ఓ చిన్న మేకింగ్ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘జాం జాం జాం జజ్జనక.. తెల్లార్లు ఆడుదాం తయ్యతక్కా’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ పాట చిత్రీకరణలో చిరు, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్‌లతో పాటు మిగిలిన ప్రధాన తారాగణమంతా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ayyannapatrudu: వైకాపా ప్రభుత్వ అక్రమాలు కనిపించడం లేదా ఉండవల్లీ?: అయ్యన్న
-
కాంగ్రెస్‌కు మల్లన్న సినిమా చూపిస్తా: మంత్రి మల్లారెడ్డి
-
Nizamabad: అపహరించిన కారులో వచ్చి.. ఏటీఎం లూటీ
-
బాంబులా పేలిన ఫోను.. కిటికీలు, సామాన్లు ధ్వంసం
-
ఐఏఎస్ కొలువుకు ఎసరు తెచ్చిన ‘కుక్క వాకింగ్’
-
పసిప్రాణాన్ని కాపాడిన వృద్ధులు