Chiranjeevi: ‘భోళా శంకర్’ నుంచి మరో లీక్.. ఫ్యాన్స్‌తో షేర్ చేసిన చిరు
‘భోళా శంకర్’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ‘చిరు లీక్స్’పేరుతో చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. సినిమాలోని ఓ పాటకు సంబంధించిన షాట్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
హైదరాబాద్: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ (bhola shankar). తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చిరు పంచుకున్నారు. చిత్ర యూనిట్‌కు కూడా తెలియకుండా తానే దీన్ని లీక్ చేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఓ ఆడియో ఫైల్‌ను ట్విటర్ వేదికగా షేర్ చేశారు.
‘భోళా శంకర్’ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఇది సంగీత్ జరుగుతుండగా వచ్చే సాంగ్. సెట్ కూడా బాగుంది. సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరూ ఈ పాటలో ఉన్నారు. అందరూ చాలా హుషారుగా ఉన్నారు. నాతో పాటు నా అభిమానులను కూడా హుషారుగా ఉంచాలని అనుకుంటున్నా. అందుకే ఈ సాంగ్ విషయాలు లీక్ చేద్దామనిపించింది. అక్కడ షూట్ చేసిన కొన్ని షాట్స్‌ను ఎడిట్ చేసి, ఇన్‌స్టాలో పంచుకుంటున్నా.ఇది ‘చిరు లీక్స్’
ఎవరికీ చెప్పొద్దు. మీరు మాత్రం చూసి ఎంజాయ్ చేయండి’’ అని ట్వీట్ చేశారు. అన్నాచెల్లి అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళా శంకర్’ను తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, ఛాయాగ్రహణం: డడ్లీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్