Ramcharan: మెగా వారసుడి సినీ ప్రయాణానికి 15 ఏళ్లు.. ట్వీట్‌ చేసిన చిరంజీవి...

సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇదే రోజు (September 15) చిరుత సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టాడు మెగా వారసుడు రామ్‌ చరణ్‌. ఆ తర్వాత ‘మగధీర’లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Updated : 28 Sep 2022 21:39 IST

హైదరాబాద్‌: సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇదే రోజు (September 15)చిరుత సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టాడు మెగా వారసుడు రామ్‌ చరణ్‌. ఆ తర్వాత ‘మగధీర’లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రంగస్థలం’ సినిమాతో ఎలాంటి పాత్రల్లోనైనా నటించగలడని నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 14 సినిమాలలో నటించి మెగా అభిమానులను, సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘ఆర్‌ఆర్ఆర్‌’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రామ్‌ చరణ్‌ సినీ ప్రయాణానికి నేటికి 15 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా చిరంజీవి ఒక ఫొటోను షేర్‌ చేసి చరణ్‌కు అభినందనలు తెలిపారు.

రామ్‌ చరణ్‌ కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేసిన చిరంజీవి ‘‘ 15 సంవత్సరాల సినీ ప్రయాణానికి అభినందనలు. ఇది నీకు మైలురాయి. చిరుత నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌. ఇప్పుడు దర్శకుడు శంకర్‌తో(RC15) సినిమా వరకు ఒక నటుడిగా నువ్వు ఎదిగిన తీరు అభినందనీయం’’ అని రాశారు. ఇక ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా రామ్‌ చరణ్‌కు ఫ్యాన్స్‌ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని