Updated : 30 Apr 2022 13:20 IST

Chiranjeevi: బాబీతో సినిమా.. చిరు టైటిల్‌ చెప్పేశారా?

హైదరాబాద్‌: తాజాగా ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi). యువ హీరోలకు దీటుగా వరుస సినిమాలు చేస్తున్న ఆయన ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులను ఒకేసారి నడిపిస్తున్నారు. అయితే, వివిధ సందర్భాల్లో తన సినిమాలకు సంబంధించిన విశేషాలను పొరపాటున లీక్‌ చేస్తున్నారు. ‘ఆచార్య’ పేరును కూడా అలాగే చెప్పేసిన చిరు ఇప్పుడు తాను నటిస్తున్న మరో చిత్రం టైటిల్‌ కూడా బయట పెట్టారా? యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ.. యువ దర్శకులతో చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. ‘‘బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్‌ చెప్పను. ఎందుకంటే లీక్‌ చేశానని అంటారు. ‘వాల్తేర్‌ వీరయ్య’. ‘ఆచార్య’ కూడా ఇలా నేనే చెప్పాను. ఈ సినిమా కథ చెప్పినప్పుడు అందరూ బాగుందనుకున్నాం.  ‘చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా’ అని బాబీ అన్నాడు. ‘నీ కష్టం ఇప్పుడే మొదలైంది. ఎన్నో సినిమా కథ ఓకే అయిన తర్వాత ఎన్నో లేయర్లు ఉంటాయి. ఎన్నో అనుమానాలు వస్తాయి. గ్రే షేడ్స్‌ ఉంటాయి. లాజిక్‌లు మిస్సవకూడదు. రెండు నెలలు పెట్టుకుని స్క్రిప్ట్‌ రెడీ చెయ్‌’ అని చెప్పాను. అతనిలో ఉన్న టాలెంట్‌ ఏంటంటే.. ఏదైనా చెబితే దాన్ని అంత అందంగా తయారు చేసి తీసుకొస్తాడు. బాగుండటానికి ఎండ్‌ అనేది లేదు. ఎంత చేస్తే అంత బాగా వస్తుంది’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

‘వాల్తేర్‌ వీరయ్య’ అని చిరు తన పాత్ర పేరు చెప్పారా? లేక సినిమా టైటిల్‌ కూడా అదే పెడతారా? అన్నది వేచి చూడాలి. ఇందులో కథానాయికగా శ్రుతిహాసన్‌ నటిస్తోంది. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ ఫాదర్‌’, మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ సినిమాలను కూడా చిరు ఏకకాలంలో చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాదే రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని