Chiranjeevi: చిరంజీవితో మోదీ ఏం మాట్లాడారంటే.. వైరల్‌ వీడియోపై మెగాస్టార్‌ పోస్ట్‌

స్టేజ్‌పై మోదీ ఏం మాట్లాడారో చిరంజీవి తెలిపారు. సోషల్‌ మీడియాలో వైరలైన  వీడియోపై స్పందించారు.

Updated : 13 Jun 2024 12:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. స్టేజ్‌ పై ఉన్న చిరంజీవి (Chiranjeevi) దగ్గరకు వచ్చిన మోదీ.. మెగా బ్రదర్స్‌ చేతులు పట్టుకొని అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయన ఏం మాట్లాడారో చిరు పోస్ట్‌ పెట్టారు. 

‘నాతో, తమ్ముడితో ప్రధాని నరేంద్ర మోదీ గారు వేదికపై మాట్లాడడం చాలా ఆనందానిచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ (Pawan kalyan) ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసినట్లు చెప్పారు. కుటుంబసభ్యులు.. ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు ఆ వీడియోలో కనిపించాయన్నారు. ఆ దృశ్యాలు మన సంస్కృతిసంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని అభినందించారు. ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రధాని మాతో అలా మాట్లాడడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వారి సునిశిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో (Narendra Modi) జరిగిన మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం’ అని చిరు పేర్కొన్నారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్‌ను నెటిజన్లు, అభిమానులు షేర్‌ చేస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని