Chiranjeevi: మాటిస్తున్నా.. ఆస్పత్రి కట్టిస్తా: మెగాస్టార్ ప్రకటన
ఒక చిత్రాన్ని తీయడంలో తెరవెనుక ఎంతో శ్రమిస్తున్న సినీ కార్మికుల కోసం తాను ఓ ఆస్పత్రి కట్టిస్తానని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రకటించారు. తన తండ్రి
సినిమా హిట్టయినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు
హైదరాబాద్: ఒక చిత్రాన్ని తీయడంలో తెరవెనుక ఎంతో శ్రమిస్తున్న సినీ కార్మికుల కోసం తాను ఓ ఆస్పత్రి కట్టిస్తానని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రకటించారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేయనున్న ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసి, సేవలు అందించేలా చూస్తానని మాటిచ్చారు. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణకు చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిర్వాహకులు సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎదుటివారికి చేతనైనంత సాయం చేసినప్పుడు వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదని ఆయన అన్నారు.
‘‘మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ తమ పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఆట విడుపుగా ఉండేందుకు కొంతమంది క్రికెట్ ఆడుతుంటారు. కేవలం సరదా కోసమే కాకుండా పది మందికి ఉపయోగపడేలా, ఒక సేవా కార్యక్రమంగా దీన్ని మార్చిన గొప్పతనం తరుణ్, శ్రీకాంత్‌దే. అందుకు వాళ్లిద్దర్నీ అభినందించాలి. ప్రేక్షకుల అభిమానానికి రుణం తీర్చుకొనేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నాం’’
‘‘కెరీర్ ఆరంభంలో ప్రతి ఒక్కరూ కొంత స్వార్థంగా ఉండటం సహజమే. బాగా సంపాదించాలని, వచ్చిన డబ్బుతో సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. జీవితంలో ఒక దశకు వచ్చాక.. ఎదుటివారికి ఏదైనా సాయం చేయాలనే భావన కలుగుతుంది. కష్టాల్లో ఉన్నవాడి ఆకలి తీర్చినప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అదెలా ఉంటుందో అనుభవ పూర్వకంగా నేను తెలుసుకున్నా. మొదట్లో నేను కూడా విలాసవంతమైన కార్లు కొనాలి, విదేశీ ప్రయాణాలు చేయాలి, నా కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా సుఖమైన జీవితాన్ని అందించాలనుకున్నా. అందుకోసం ఎంతో శ్రమించా. పారితోషికం పెరుగుతూ వచ్చింది. కొన్నాళ్లు అయ్యాక.. నాకు ఇంతటి అభిమానాన్ని అందించిన ప్రేక్షకులకు ఏదైనా చేయాలనే భావన కలిగింది. అలా సేవా కార్యక్రమాల్లో భాగమయ్యా. బ్లడ్ బ్యాంక్ స్థాపించా. అది ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోందంటే దాని వెనుక ఎంతోమంది సహకారం ఉంది. వాళ్లందరికీ మరోసారి ధన్యవాదాలు. సినిమా సక్సెస్ అయినప్పటి కంటే ఒకరికి సాయం చేసినప్పుడు లభించిన తృప్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోజు ప్రశాంతంగా నిద్రపోతాం’’
‘‘మా అందరికీ చదువులు అంతంత మాత్రమే. అయినా మేం సౌకర్యవంతంగా జీవిస్తున్నామంటే దానికి సినీ పరిశ్రమే కారణం. అందుకే సినిమా కోసం శ్రమిస్తున్న కార్మికులకు చిత్రపురి కాలనీలో ఓ ఆస్పత్రి కట్టించాలని ఎంతోకాలంగా అనుకుంటున్నా. రోజువారీ సినీ కార్మికులకు ఉపయోగపడేలా 10 పడకలతో ఓ ఆస్పత్రి ఉంటే బాగుంటుందనిపించింది. మా నాన్నగారు కొణిదెల వెంకట్రావు పేరుతో ఈ ఆస్పత్రి నిర్మించాలనుకుంటున్నాం. ఈ పుట్టినరోజుకు మీకు మాటిస్తున్నా.. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఆసుపత్రి కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ఈ ఆస్పత్రికి చేయూతనందిస్తున్న తమ్ముళ్లందరికీ, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ ఆస్పత్రి నిర్మాణంలో ఎవరైనా భాగస్వాములవుతానంటే సంతోషంగా ఆహ్వానిస్తా. దానికి ఎన్నికోట్లు ఖర్చైనా మొత్తం భరించే శక్తి ఆ భగవంతుడు నాకిచ్చాడు. మా ఎదుగుదలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరిస్తున్న వర్కర్స్కు దీన్ని ఏర్పాటు చేయడం నా ప్రాథమిక బాధ్యతగా భావిస్తున్నా’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
చిరు ప్రకటనతో స్టేజ్‌పై ఉన్న శ్రీకాంత్, తరుణ్, తమన్, సుధీర్ బాబు.. పలువురు నటీనటులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తమన్ మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రికి సాయం చేసేందుకు తాను ఓ మ్యూజికల్ షో ఏర్పాటు చేస్తానని, దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆస్పత్రి నిర్మాణానికి ఇస్తానని ప్రకటించారు. తమన్ సాయానికి చిరు ఎంతో ఆనందించారు. సినీ కార్మికులకు చిరు చేస్తోన్న సాయం తెలుసుకున్న మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా చిరు నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్‌గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్‌గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్‌సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.. -
ఉదయనిధి బ్యానర్‌తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్‌తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్‌తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్‌తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కాలేజీ ఫెస్ట్‌లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
ఉత్తమ దర్శకుడిగా అజయ్ భూపతి.. సోషల్ మీడియాలో పోస్ట్
తాను ఉత్తమ దర్శకుడిగా ఎంపికైనట్లు అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అది ఏ అవార్డు అంటే? -
ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు.. ట్రోల్స్‌పై ఏమన్నారంటే..
నటి అవంతిక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. -
‘అఖండ2’ కాన్సెప్ట్ ఇదే.. హిట్ సినిమా సీక్వెల్‌పై బోయపాటి కామెంట్స్..
‘అఖండ2’లో సమాజానికి ఉపయోగపడే అంశాలన్నీ ఉంటాయని బోయపాటి శ్రీను అన్నారు. -
‘యానిమల్’ మూవీ తమిళ వెర్షన్.. ఆడిటోరియం దద్దరిల్లే ఆన్సర్ ఇచ్చిన సందీప్‌రెడ్డి
‘యానిమల్’ మూవీ తమిళంలో తీస్తే సూర్య తన ఛాయిస్ అని దర్శకుడు సందీప్ అన్నారు. -
బికినీలో మాళవిక.. అరియానా అందాలు కేక
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోలు మీకోసం.. -
వరలక్ష్మి శరత్‌కుమార్ నిశ్చితార్థం.. విశాల్ ఏమన్నారంటే..?
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ (Vishal) స్పందించారు. -
ఎన్టీఆర్‌తో ఊర్వశి ఫొటో.. అందుకు క్షమాపణ చెప్పిన నటి
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటెల.. ఎన్టీఆర్‌తో సెల్ఫీ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
ఇది పక్కా సూపర్ హిట్: ‘పుష్ప 2’పై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న యాక్షన్ డ్రామా ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). ఈ చిత్రాన్ని ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. -
శంకర్ కుమార్తె వివాహం.. సినీ తారల సందడి
ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya) వివాహం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు సందడి చేశారు.