Chiranjeevi: నా అభిమానులు ఉన్న ప్రతి చోటా బ్లడ్ బ్యాంకు ఉన్నట్లే: చిరంజీవి
రక్తం దొరక్క ప్రాణాలు పోవడమనేది తనని ఎంతగానో బాధించిందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. తమ దూరపు బంధువు కూడా అలాగే చనిపోవడంతో, ప్రమాదంలో ఉన్న వారికి రక్తం అందించాలన్న ఉద్దేశంతోనే బ్లడ్‌బ్యాంకు ఆలోచన వచ్చిందన్నారు.
హైదరాబాద్: అభిమానుల వల్లే చిరంజీవి బ్లడ్ బ్యాంకు, రక్తదానం అనే కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో జీవనదిలా ప్రవహిస్తోందని, ఎందరో ప్రాణాలను కాపాడుతోందని, అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ‘చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు’ సెంటర్‌ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గెరత్ ఒవెన్ సందర్శించారు. చిరు చేస్తున్న సామాజిక సేవను అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ 20సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి 7 లక్షల విలువైన జీవిత బీమా కార్డులు అందజేశాం. మొదటి విడత తెలంగాణ గవర్నర్ తమిళసై అందించారు. ఇప్పుడు రెండో విడతగా 1500మందికి గెరత్ చేతుల మీదుగా ఇచ్చాం. అభిమానులు లేకపోతే, ఒక జీవనదిలా రక్తదాన కార్యక్రమం జరిగేది కాదు. ఇందుకు దోహదపడుతున్న మీ మంచి మనసుకు, మీ మానవత్వ విలువకు ధన్యవాదాలు. రక్తం దొరక్క ప్రాణాలు పోవడం అనేది నన్ను బాధించింది. మా దూరపు బంధువు కూడా అలాగే చనిపోయారు. అప్పుడు వచ్చిన ఆలోచనే బ్లడ్‌బ్యాంకు. నాకున్న అభిమానులను ఇలా సామాజిక సేవ వైపు నడిపిస్తే బాగుంటుందని అనిపించింది. నా అంచనాలను మించి, అభిమానులు ముందుకు వచ్చారు’’
అందుకే ఎక్కువ చిరంజీవి బ్లడ్ బ్యాంకులు పెట్టలేదు!
‘‘తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయలేకపోవడానికి సాంకేతికంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రతిదానిపైనా వ్యక్తిగత నిఘా ఉండాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే అవి నన్ను ఎంతగానో బాధిస్తాయి. అందుకే తక్కువ సెంటర్స్ ఏర్పాటు చేసి, రక్తదానం గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం. బ్లడ్ బ్యాంకులపై నమ్మకస్తులైన వారి నిరంతర పర్యవేక్షణ అవసరం. అయితే, ప్రతిచోటా ఎక్కడికి, ఎవరికి బ్లడ్ అవసరం ఉన్నా సరే, ఒక ఫోన్‌కాల్‌తో వెళ్లి నా అభిమానులు రక్తదానం చేస్తున్నారు. నా అభిమానులు ఉన్న ప్రతి చోటా బ్లడ్ బ్యాంకు ఉన్నట్లే’’
అవార్డుల కోసం ఆరాటపడాల్సిన పనిలేదు!
‘‘ఇటీవల ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022’ అవార్డు వచ్చింది. మన దారిలో మనం వెళ్తూ, సమాజానికి మంచి చేసుకుంటూ వెళ్లాలి. ఆ దారిలో తారసపడే గుర్తింపులే ఈ అవార్డులు. వాటికోసం ఆరాటపడాల్సిన అవసరం లేదు. ఇవి అప్రయత్నంగా వచ్చేస్తాయి. ఆర్టిస్ట్‌గా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి. అదేసమయంలో ఒక నటుడికి సామాజిక బాధ్యత కూడా ఉంటుంది’’ అని చిరంజీవి అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో పాటు చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’లో నటిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!
-
Politics News
Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు
-
Movies News
Natti Kumar: కౌన్సిల్ ఒక్కటే ఉండాలి.. ‘దాసరి’పై సినిమా తీయబోతున్నాం.. నట్టి కుమార్
-
World News
Earthquake: ఆ భూకంప ధాటికి.. దేశమే 5మీటర్లు జరిగింది..!