
Chiranjeevi: చిరంజీవికి కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన నటుడు
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు, నటుడు మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. ‘‘అన్నిరకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. కాబట్టి గత కొన్నిరోజుల నుంచి నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. త్వరలోనే మీ అందరి ముందుకు పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తాను’’ అని చిరంజీవి తెలిపారు. ఆయన ట్వీట్‌తో అభిమానులందరూ ఆందోళనకు గురవుతున్నారు. చిరు వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ వరుస ట్వీట్లు పెడుతున్నారు.
శ్రీకాంత్‌కు కరోనా..
నటుడు శ్రీకాంత్ సైతం కరోనా బారినపడ్డారు. జాగ్రత్తలు పాటించినప్పటికీ తాను కొవిడ్ బారినపడినట్లు తెలిపారు. గత కొన్నిరోజుల నుంచి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని.. ఇటీవల తనని కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.