Vishwambhara: చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్‌ నటుడు.. అధికారికంగా ప్రకటించిన టీమ్

‘విశ్వంభర’లో ఓ బాలీవుడ్‌ నటుడు నటించడం ఖాయమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్‌ పోస్ట్‌ పెట్టింది. 

Updated : 14 Jun 2024 12:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రధానపాత్ర పోషిస్తుండగా.. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఇప్పటికే వరుస అప్‌డేట్‌లతో సందడి చేస్తున్న మూవీ యూనిట్‌.. తాజాగా మరో కొత్త సమాచారంతో అభిమానుల్లో జోష్ పెంచింది. ఇందులో ఓ బాలీవుడ్‌ నటుడు పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. 

బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌ (Kunal Kapoor) ‘విశ్వంభర’ టీమ్‌లో జాయిన్‌ అయినట్లు తెలుపుతూ దర్శకుడు పోస్ట్‌ పెట్టారు. ఇందులో కునాల్‌ విలన్‌గా కనిపించనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ హీరోపై పోస్ట్‌ పెట్టిన నిర్మాణ సంస్థ.. ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. ఇందులో కునాల్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. ఆయన విలన్ అని తెలిసే ట్విస్ట్‌ సినిమాకే హైలైట్‌ అని టాక్‌. ఇప్పటికే ఈ బీటౌన్‌ హీరోపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కునాల్‌ కూడా పాల్గొంటున్నారు. జులై చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో శరవేగంగా షూట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌పై చిత్రబృందం ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

రివ్యూ: మహారాజ.. విజయ్‌ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?

రూ.200కోట్లతో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఇప్పటి వరకు చూడని పాత్రలో చిరు (Chiranjeevi) కనిపించనున్నారు. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయి. ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు ఉండనున్నట్లు ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో స్టార్‌ హీరోయిన్స్‌ త్రిష (Trisha), ఆషికా (Ashika Ranganath) అధికారికంగా జాయిన్‌ అయ్యారు. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు