Chiranjeevi: బన్నీపై ట్వీట్‌ చేసిన చిరు.. నిమిషాల్లో రియాక్షన్‌ మామూలుగా లేదు

బన్నీని ప్రశంసించిన మెగాస్టార్‌ చిరంజీవి

Updated : 08 Apr 2022 11:28 IST

హైదరాబాద్‌: ‘పుష్ప’ విజయంతో పాన్‌ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. కెరీర్‌లో బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న బన్నీ ప్రస్తుతం తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. శుక్రవారం బన్నీ పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు సినీతారలు, దర్శకనిర్మాతలు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్‌ చిరంజీవి సైతం తన మేనల్లుడ్ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో’’ అని చిరు పేర్కొన్నారు. చిరు చేసిన ట్వీట్‌పై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లైక్స్‌, రిట్వీట్స్‌ రూపంలో తమ రియాక్షన్స్‌ తెలియజేస్తున్నారు. అలా, కొన్ని క్షణాల్లోనే ఈ ట్వీట్‌ని 8800మంది లైక్‌ చేయగా, సుమారు 2200 మంది రీట్వీట్‌ చేశారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని