Chiranjeevi: సామ్‌ కోసం చిరంజీవి ట్వీట్‌..

మనిషి జీవితంలో సమస్యలు వస్తుంటాయని చిరంజీవి అన్నారు. సామ్‌ అనారోగ్యంపై స్పందించిన ఆయన తాజాగా ట్వీట్‌ పెట్టారు.

Updated : 30 Oct 2022 14:06 IST

హైదరాబాద్‌: నటి సమంతను (Samantha) ఉద్దేశిస్తూ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. సామ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ‘‘డియర్‌ సామ్‌.. కాలానుగుణంగా మన జీవితాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటివల్ల మనకెంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలుస్తుంది. మనోబలం కలిగిన అద్భుతమైన అమ్మాయివి నువ్వు. అతి త్వరలో ఈ సమస్యను నువ్వు అధిగమిస్తావనే నమ్మకం నాకు ఉంది’’ అని చిరు ధైర్యం చెప్పారు.

ఎంతో కాలం నుంచి సోషల్‌మీడియాకు దూరంగా ఉన్న సమంత శనివారం సాయంత్రం తన అనారోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. తాను ‘మయోసైటిస్‌’తో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నానని, త్వరలో దీని నుంచి కోలుకుంటానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సినీ తారలందరూ ఆమెలో ఆత్మస్థైర్యం నింపేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని