Chiranjeevi: అతడిని చూస్తే చాలు పొట్ట చెక్కలవుతుంది.. బ్రహ్మానందాన్ని విష్ చేసిన చిరంజీవి
బ్రహ్మానందానికి(Brahmanandam) మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌లో ఫొటోలను పంచుకున్నారు.
హైదరాబాద్: తెలుగు సినీ ప్రపంచంలో హాస్యనటుడు బ్రహ్మానందానికి(Brahmanandam) ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన హాస్యం వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన.. తెరపై కనిపించినప్పుడల్లా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. గిన్నిస్‌బుక్ రికార్డును కైవసం చేసుకున్న ఈ హాస్యబ్రహ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ఆయన్ని విష్ చేస్తున్నారు.
బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి(Chiranjeevi) ట్వీట్ చేశారు. ‘‘నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఓ లెక్చరర్. ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న గొప్ప హాస్య నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతడు కామెడీ చెయ్యక్కర్లేదు.. అతడి వైపు చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయపూర్వక శుభాభినందనలు. ఆయన ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పదిమందిని నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. తనకి నా జన్మదిన శుభాకాంక్షలు’’ అని రాశారు. బ్రహ్మానందంతో దిగిన ఫొటోలను చిరంజీవి షేర్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు
-
General News
Polavaram: ‘పోలవరం’ ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం
-
Movies News
Shakuntalam: అప్పటి నుంచే నా సినిమాల్లో నిజమైన బంగారు ఆభరణాలు వాడుతున్నా: గుణశేఖర్
-
Politics News
Revanth Reddy: లీకేజీ వ్యవహారం.. కేటీఆర్ నుంచి ఎందుకు సమాచారాన్ని సేకరించలేదు?: రేవంత్
-
Sports News
On This Day: ఆ ఓటమికి సరిగ్గా 20 ఏళ్లు.. ప్రతి భారతీయుడి గుండె పగిలిన రోజు
-
Politics News
Rahul Gandhi: మమ్మల్ని అంతం చేసే కుట్రే..! రాహుల్కు శిక్షపై ప్రతిపక్షాల మండిపాటు