Chiranjeevi: ఆ మాటకు ధన్యవాదాలు.. మంత్రి కందుల దుర్గేశ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు

కందుల దుర్గేశ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ సెట్స్‌లో ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. 

Updated : 20 Jun 2024 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కందుల దుర్గేశ్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ సెట్స్‌కు ఆయన వచ్చిన సందర్భంగా ఆ ఫొటోలను ఎక్స్‌ వేదికగా చిరు పంచుకున్నారు.

‘మిత్రుడు కందుల దుర్గేశ్‌ (Kandula Durgesh) ఆంధ్రప్రదేశ్‌ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా శుభాకాంక్షలు. ‘విశ్వంభర’ (Vishwambhara) సెట్స్‌లో ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటోన్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటాను’ అని దుర్గేశ్ చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.  ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థలాల్ని పర్యటక శాఖ మంత్రిగా పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నా.. విశ్వసిస్తున్నా’ అని చిరంజీవి (Chiranjeevi) పేర్కొన్నారు. ఈసందర్భంగా ‘విశ్వంభర’ సెట్‌లో ఆయనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. అందులో చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు మూవీ యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇక సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని