చిరు పుట్టిన రోజున ఏ వార్త చెబుతారో..!

సినీ తారల పుట్టిన రోజు సందర్భంగా వారి కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలు బయటపెట్టడం అనవాయితీగా మారిపోయింది.  దీంతో ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు(ఆగస్టు 22) కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఇప్పుడు కొరటాల శివ

Published : 06 Aug 2020 10:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ తారల పుట్టిన రోజు సందర్భంగా వారి కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలు ప్రకటించడం సంప్రదాయంగా మారిపోయింది. దీంతో ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు(ఆగస్టు 22) కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటిస్తారని తెలుస్తోంది. మొదట్లో ‘లూసిఫర్‌’కు యువ దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహిస్తారని చిరునే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వి.వి. వినాయక్‌ వద్దకు వెళ్లిందని సమాచారం. అదే సమయంలో దర్శకుడు బాబీ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట. దీంతో బాబీ స్క్రిప్టు పనుల్లో నిమగ్నమయ్యాడు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే మరికొన్ని రోజుల్లో చిరంజీవి పుట్టిన రోజు రాబోతుంది. ఈ పుట్టిన రోజున చిరు నుంచి ఏ సినిమా వార్త రాబోతుందోనని అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రబృందం నుంచి అధికారికంగా చిరు ఫస్ట్‌లుక్‌ లేదా టీజర్‌ లాంటిది ఏదైనా విడుదల చేస్తారేమోనని భావిస్తున్నారు. మరోవైపు ‘లూసిఫర్‌’ రీమేక్‌ బాధ్యతలు ఈ మధ్యే వి.వి. వినాయక్‌ తీసుకోవడంతో దీని స్క్రిప్టు పనులకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. బాబీ కథ సిద్ధంగా ఉండటంతో ‘లూసిఫర్‌’ కంటే ముందు బాబీ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ మూడు చిత్రాలకు సంబంధించి చిరంజీవి ఏ వార్త చెబుతారో తెలియాలంటే ఆయన పుట్టిన రోజు వరకు వేచి చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు