Charitha Kaamakshi:చిరు బిడియం.. మదిలో మోమాటం

నవీన్‌ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్న చిత్రం ‘చరిత కామాక్షి’. చందు సాయి  దర్శకుడు. రజిని రెడ్డి నిర్మాత. అబూ స్వరాలందించారు. ఈ సినిమాలోని ‘‘చిరు బిడియం.. మదిలో మోమాటం’’ అనే గీతాన్ని ఇటీవల విడుదల చేశారు.

Updated : 21 Jan 2022 07:19 IST

వీన్‌ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్న చిత్రం ‘చరిత కామాక్షి’. చందు సాయి  దర్శకుడు. రజిని రెడ్డి నిర్మాత. అబూ స్వరాలందించారు. ఈ సినిమాలోని ‘‘చిరు బిడియం.. మదిలో మోమాటం’’ అనే గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు మనోహర్‌ పలిశెట్టి సాహిత్యమందించగా.. చిన్మయి ఆలపించారు. పాటలో నవీన్‌, దివ్యల కెమిస్ట్రీ చూడముచ్చటగా కనిపించింది. ‘‘ఓ సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామ’’న్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి కూర్పు: కోడాటి పవన్‌ కల్యాణ్‌, ఛాయాగ్రహణం: రాకీ వనమాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని