Avasarala srinivas: ‘బాలా’ కన్నా ముందు రావాల్సింది!
‘నూటొక జిల్లాల అందగాడు’ సినిమా గురించి అవసరాల శ్రీనివాస్ మీడియాతో పంచుకున్న సినిమా కబుర్లు..
‘అష్టాచమ్మా’తో నటుడిగా తెలుగు తెరకు పరిచయమై దర్శకుడిగా, రచయితగా ప్రత్యేకతను చాటుకున్నారు శ్రీనివాస్ అవసరాల . ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలతో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా మారిపోయారాయన. ఇప్పుడు రచయితగా, హీరోగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
‘‘బాలా’ విడుదలకు ముందే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాను ప్రారంభించాం. ఆ సినిమా వస్తుందని తెలిసి, దానికి పోటీగా ఒకేసారి విడుదల చేద్దామనుకున్నాం. కానీ ‘బాలా’, ‘ఉజ్డా చమన్’ సినిమాలు పోటీపడి విడుదల చేయడంతో మేం వెనక్కి తగ్గాం. ఆ తర్వాత లాక్డౌన్ కారణంగా వాయిదా పడి మళ్లీ ఇప్పుడు విడుదలవుతోంది. బాలా విడుదలైనప్పుడు సినిమాలో మార్పులేవైనా చేయాల్సి ఉంటుందేమోనని చూశాను. మా కథకు దానికి పొంతన కనిపించలేదు. కానీ ‘బాల’ కన్నా ముందు వచ్చి ఉంటే బాగుండేది. అందరూ మీ సినిమా రీమేకా? అని అడుగుతున్నారు. ముందే వచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు’’
క్రిష్ మెచ్చిన కథ
‘‘రంగు, ఎత్తు, రూపాలపై మన సమాజం నుంచి ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తుండటం సహజం. స్నేహితుల మధ్య ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. వీటి కారణంగా ఆత్మవిశ్వాసం దెబ్బతిని కుంగిపోయిన వాళ్లున్నారు. తేలికగా తీసుకున్నప్పటికీ ఆకర్షణీయంగా ఉండమనే భావన కొందరిని జీవితాంతం వెంటాడుతుంది. ఈ భావన తప్పు అని చెప్పాలనిపించింది. ‘జ్యో అచ్యుతానంద’ కథా చర్చల సమయంలోనే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఆలోచనను క్రిష్‌తో పంచుకున్నాను. బాగుందనడమే కాదు, స్వయంగా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ కథకు ‘అందమే ఆనందం’ టైటిల్ పెట్టాలనుకున్నాం. క్రిష్ గారే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అయితేనే బాగుంటుందని పట్టుపట్టారు’’
అందుకే దర్శకత్వం చేయలేదు
‘‘దర్శకుడిగా మూడో చిత్రం షూటింగ్ సగం వరకు పూర్తయింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను దర్శకుడిగా దీన్ని తెరకెక్కించడం బిజినెస్‌పరంగా బాగుండదని అనిపించింది. విద్యాసాగర్ నా గత చిత్రాలకు అసోసియేట్‌గా చేశారు. ఆయనైతే ఈ సినిమాకు న్యాయం చేస్తారనిపించింది. కథ నేనే రాసిన దర్శకత్వంలో వేలు పెట్టలేదు. రుహాని శర్మ నటించిన చి.ల.సౌ. చూశాను. ఆ సినిమాలో చాలా బాగా నటించింది. వేరే సినిమా కోసం ఆమెను సంప్రదించాను. అది వర్కౌట్ కాలేదు. చిత్ర నిర్మాతలకు తనను హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. మా సినిమాలోనూ బాగానే నటించింది. ఈ సినిమా ద్వారా ప్రత్యేకంగా సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించలేదు. సినిమాకు ఎంత డబ్బుల వస్తాయో పక్కనపెడితే, కానీ, జనాలు తేలిక పడితే విజయం సాధించినట్టే. ఒక్క సినిమాతో ప్రపంచంలో సమస్యలు పరిష్కారమవవు. కానీ ఇలాంటి అవగాహన కల్పించడం వల్ల మెల్లమెల్లగా మార్పొస్తుంది. అలాంటి మార్పు తేగలిగితే చాలు’’
అందుకే ఆలస్యం
‘‘ఊహలు గుసగులాడే’ సినిమాను రాసేందుకు మూడేళ్లు పట్టింది. ఆ తర్వాత ‘జ్యో అచ్యుతానంద’కు రెండేళ్లు పట్టింది. అందుకే సినిమాలు ఆలస్యమవుతున్నాయి. నాకు కొన్ని పాత్రలకే పరిమితం అవ్వాలని ఉండదు. నటుడిగా ప్రత్యేక ముద్ర ఉండటం ఇష్టం లేదు. భిన్నమైన పాత్రల్లో నటించి నిరూపించుకోవాలని ఉంటుంది. అందుకే ‘జెంటిల్మెన్’లో విలన్‌గా చేశా, ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో కూడా అందుకే నటించాను. మరో నాలుగు కథలు రాసి పెట్టుకున్నాను. ఈ సినిమా తర్వాత వాటి మీదే దృష్టి పెడదామని నిర్ణయించుకున్నాను’’
రచయితగానే ఎక్కువ సంతృప్తి
‘‘క్రిష్‌గారు చేయడం వల్ల సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఎడిటింగ్‌లో ఆయన ఇచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. నా మూడో సినిమా ‘ఫలాన అబ్బాయి, ఫలానా అమ్మాయి’ 50 శాతం పూర్తయింది. మిగతాది అమెరికాలో చేయాల్సి ఉంది. అది బహుశా వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశముంది. కలల ప్రాజెక్టు అంటూ ఏం లేదు. ఆ సమయానికి ఎలాంటి కథ చెబితే బాగుంటుందనే ఆలోచిస్తాను. నటుడిగా, దర్శకుడిగా కన్నా రచయితగానే ఎక్కువ సంతృప్తి దొరికింది. అమెజాన్ ప్రైమ్ కోసం నిత్యామేనన్‌తో కలిసి ఓ షో చేయాల్సి ఉంది. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమౌతుంది. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఆద్యంతం నవ్విస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా’’
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eatala Rajender: నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారు: ఈటల
-
Ap-top-news News
Gas Cylinder: సిలిండర్ తెచ్చినందుకు అదనపు రుసుము చెల్లించొద్దు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్