Published : 13 Mar 2022 12:33 IST

Kandikonda: కందికొండకు ఇల్లు కేటాయింపుపై వివాదం.. స్పందించిన సొసైటీ అధ్యక్షుడు

హైదరాబాద్‌: హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన రచయిత కందికొండ యాదగిరి అనారోగ్యంతో శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రపురి కాలనీలో కందికొండకు ఇల్లు కేటాయింపు విషయంపై ఎంతోకాలం నుంచి ఉన్న వివాదంపై తాజాగా చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ స్పందించారు. మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశాల మేరకు కందికొండ కుటుంబానికి గతంలోనే సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిని కేటాయించామని, రచయిత కుటుంబం మాత్రం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిని కోరిందని తెలిపారు.

‘‘చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో కందికొండ సభ్యత్వం తీసుకున్న మాట వాస్తవం. రూ.4లక్షలు కట్టి ఆయన సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం పలు కారణాలు చెప్పి ఆ డబ్బుని వాపస్‌ తీసేసుకున్నారు. ఈ క్రమంలోనే కందికొండ అనారోగ్యం విషయం తెలిసి ఆయన కుటుంబానికి వెంటనే ఇల్లు మంజూరు చేయమని మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్ సూచించారు. వారి ఆదేశాల మేరకు రచయిత కుటుంబానికి సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిని కేటాయించాం. అది తమకు సరిపోదని.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కావాలని వాళ్లు కోరారు. కాబట్టి త్వరలోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిని ఇస్తాం’’ అని అనిల్‌కుమార్ అన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts