Cobra: విక్రమ్‌ ‘కోబ్రా’.. విడుదల తేదీ మారింది.. వీడియో అదిరింది!

విక్రమ్‌ విభిన్న గెటప్పుల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కోబ్రా’. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది.

Published : 20 May 2022 19:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విక్రమ్‌ (Chiyaan Vikram) విభిన్న గెటప్పుల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కోబ్రా’ (Cobra). అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో విక్రమ్‌ లుక్‌, నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో విక్రమ్‌ గొప్ప గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, కె.ఎస్‌. రవికుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ముఖ్య పాత్రలో సందడి చేయనున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియో సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా మే 26న విడుదలకావాల్సింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని