Vikram: నిజంగా నేనే వచ్చా.. డూపు కాదు: విక్రమ్‌

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌ (Vikram) ఇకపై అభిమానులకు మరింత చేరువగా ఉండనున్నారు. తన సినిమా అప్‌డేట్‌లు, ఇతర ముఖ్యమైన విషయాలను వీలైనంత ఎక్కువమంది అభిమానులకు చేరువ చేయనున్నారు....

Published : 13 Aug 2022 12:01 IST

వైరల్‌గా మారిన స్టార్‌ హీరో స్పెషల్‌ వీడియో

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌ (Vikram) ఇకపై అభిమానులకు మరింత చేరువగా ఉండనున్నారు. తన సినిమా అప్‌డేట్‌లు, ఇతర ముఖ్యమైన విషయాలను వీలైనంత ఎక్కువమంది అభిమానులకు చేర్చనున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది?

వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉండే విక్రమ్‌ సోషల్‌ మీడియాను చాలా అరుదుగా ఉపయోగిస్తుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్న ఆయనకు ఇప్పటివరకూ ఫేస్‌బుక్‌ ఖాతా కూడా లేదంటేనే అర్థమవుతోంది. అభిమానులందరి కోరిక మేరకు 2016 నుంచి ఇన్‌స్టా గ్రామ్‌లో ఆయన ఖాతా ప్రారంభించారు. ‘the_real_chiyaan’ అనే పేరుతో ఉన్న ఆ ఖాతా వేదికగా తన ఇష్టాయిష్టాలు, కొత్త సినిమా విశేషాలు, షూట్‌ లొకేషన్స్‌.. ఇలా ఎన్నో అంశాలను ఆయన పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన మరో సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టారు. ట్విటర్‌ వేదికగా ఇకపై ఆయన అందుబాటులోకి వచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం రాత్రి ట్విటర్‌లో ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. అందులో ఆయన పొడవాటి గడ్డంతో విభిన్నమైన లుక్‌లో కనిపించారు. ‘‘నేను మీ చియాన్‌ విక్రమ్‌. నిజంగా నేనే. డూప్‌ కాదు. నా తదుపరి సినిమా కోసం ఇలా సిద్ధమవుతున్నా. చాలా ఆలస్యంగా వచ్చాను.. ఏం అనుకోకండి. కానీ ఇది సరైన సమయమనే అనుకుంటున్నా. మీరు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇకపై మీకు ట్విటర్‌లోనూ అందుబాటులో ఉండనున్నా’’ అని విక్రమ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన చియాన్‌ అభిమానులు.. తమ అభిమాన నటుడు ట్విటర్‌లోకి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని