Vikram: మణిరత్నానికి ధన్యవాదాలు చెబుతూ.. ఓల్డ్ వీడియో షేర్ చేసిన విక్రమ్..
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన రావణ్, పొన్నియిన్ సెల్వన్ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా విక్రమ్ రావణ్ సినిమా ప్రొమోషన్స్ సమయంలో వీడియో షేర్ చేసి మణిరత్నానికి ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: తన విలక్షణమైన నటనతో అన్ని భాషల్లోని సినీ ప్రియులను ఆకట్టుకున్నాడు హీరో విక్రమ్. తాజాగా పొన్నియిన్ సెల్వన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి సత్తా చాటాడు. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన రెండో సినిమా ఇది. తాజాగా విక్రమ్ ఓ పాత వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేసి మణిరత్నానికి ధన్యవాదాలు తెలిపారు.
విక్రమ్ షేర్ చేసిన వీడియోలో మణిరత్నం మాట్లాడుతూ ‘రావణ్’ సినిమాలో హిందీ, తమిళ భాషల్లో విక్రమ్‌ను ఎంచుకోడానికి గల కారణాన్ని చెబుతూ..‘‘విక్రమ్ చాలా గొప్ప నటుడు. ఎలాంటి సన్నివేశాన్ని అయినా చాలా త్వరగా అర్థం చేసుకోగలడు. అలాంటి నటుడితో సినిమా చేయడం చాలా తేలిక’’ అని చెప్పారు. దీనిపై స్పందించిన విక్రమ్ ‘‘నా గురించి ఇంత మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మీరు దర్శకత్వం వహించిన రెండు అద్భుతమైన సినిమాల్లో నాకు అవకాశం కల్పించారు. అప్పుడు రావణ్‌లో వీరగా, తాజాగా పొన్నియిన్ సెల్వన్‌లో ఆదిత్య కరికాలన్‌గా రెండు మంచి పాత్రలు ఇచ్చారు. ఆ రెండు పాత్రల్లో నేను అంత గొప్పగా నటించడానికి మీరే నాకు స్ఫూర్తి’’ అని అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Karnataka: కర్ణాటక ఎన్నికలకు మోగనున్న నగారా.. వయనాడ్‌కూ షెడ్యూల్ ప్రకటిస్తారా?
-
Movies News
Taapsee: లక్ష్మీదేవి నెక్లెస్ వివాదం.. తాప్సీపై కేసు నమోదు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం
-
Ts-top-news News
MLC Kavitha: కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ