RIP Anand: మేమింకా షాక్‌లోనే ఉన్నాం

Rangam Anand: కేవీ ఆనంద్‌ మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం

Updated : 30 Apr 2021 12:18 IST

సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు

చెన్నై: ‘రంగం’, ‘బందోబస్త్‌’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కె.వి.ఆనంద్‌ మరణవార్త తమని షాక్‌కు గురిచేసిందని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆనంద్‌ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విషయం తెలిసిందే. దీంతో దక్షిణాది చిత్రపరిశ్రమల్లో విషాద చాయాలు నెలకొన్నాయి. మరోవైపు ఆయన మృతిపట్ల ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం సంతాపం ప్రకటించారు.

‘కె.వి.ఆనంద్‌ మరణవార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయన ఇకపై మన మధ్య ఉండరంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. అలాగే, దేవుడు ఆయన కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను’

- రజనీకాంత్‌

‘ఇకపై మీరు మా కంటికి కనిపించకపోవచ్చు. కానీ, మా హృదయాల్లో ఎప్పటికీ మీరు చిరస్మరణీయం. కె.వి.ఆనంద్‌ సర్‌.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’

- మోహన్‌లాల్‌

‘మ్యాగజైన్‌ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుని.. దర్శకుడిగా విభిన్న చిత్రాలు తెరకెక్కించిన కె.వి.ఆనంద్‌ మరణవార్త నన్ను కలచివేసింది. ఆయన మరణం సినీరంగానికి ఓ పెద్ద లోటు’

- కమల్‌హాసన్‌

‘ఆనంద్‌ మరణవార్తతో నిద్రలేచాను. ఆయన ఓ అద్భుతమైన కెమెరామెన్‌, గొప్ప దర్శకుడు, మంచి వ్యక్తి. సర్‌.. మీరు ఎప్పటికీ మాకు గుర్తుండిపోతారు. అలాగే మేము మిమ్మల్ని మిస్‌ అవుతూనే ఉంటాం. దర్శకుడి కుటుంబసభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’

- అల్లు అర్జున్‌

‘నిద్రలేవగానే కె.వి. ఆనంద్‌ సర్‌ కన్నుమూశారనే వార్త విని ఉలిక్కిపడ్డాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’

- హన్సిక

‘నేనింకా ఆ షాక్‌లోనే ఉన్నాను. ఓ అద్భుతమైన సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు, మంచి వ్యక్తి, స్నేహితుడైన ఆనంద్‌గారు మనల్ని వదిలివెళ్లిపోయారంటే బాధగా ఉంది. సినీ పరిశ్రమ ఆయన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’

- రత్నవేలు

‘పేరు పొందిన దర్శకుల్లో ఒకరైన ఆనంద్‌ సర్‌ని కోల్పోవడం బాధగా ఉంది. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నాను. ఓం శాంతి’

- కాజల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు