New Year 2022 : కష్టాలు తొలగాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. సినీ తారల న్యూఇయర్‌ విషెస్‌

వినోదాన్ని, ఆనందాన్ని పంచే సినీ పరిశ్రమ 2022  నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా, ఒమిక్రాన్‌ కష్టాలు తొలిగి కొత్త సంవత్సరం ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని కోరుకున్నారు. 

Updated : 08 Dec 2022 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినోదాన్ని, ఆనందాన్ని పంచే సినీ పరిశ్రమ 2022  నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా, ఒమిక్రాన్‌ కష్టాలు తొలిగి కొత్త సంవత్సరం ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని కోరుకున్నారు. 

మీ అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2022 కొత్త సంవత్సర శుభాకాంక్షలు - మెగాస్టార్‌ చిరంజీవి

కొత్త ఏడాదిలో జరగబోయే మ్యాజిక్‌ను నమ్మండి. అందరితో సంతోషంగా గడపండి, ఇతరులకు సాయపడండి. మీరంతా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ.. 2022 న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు. లవ్‌ యూ ఆల్‌- మహేశ్‌ బాబు

ఈ రెండేళ్లలో కరోనా కష్టాలను చూశాం. వాటన్నంటి నుంచి కోలుకుని మళ్లీ సంతోషంగా గడపాలని ఆశిస్తున్నా. దేవుడు అందరినీ ఏదో ఒక సందర్భంలో పరీక్షించిన తరువాత ఆశీర్వాదాలను అందిస్తాడు. ఈఏడాది ఈరోజు నుంచి సంతోషంగా, విజయవంతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ - నయనతార, విక్కీ










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని