సిరివెన్నెల ఆకాంక్ష.. సమంత పైరింగ్స్‌‌.. ఝాన్సీ డైట్‌

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకాంక్షించారు. నటి, వ్యాఖ్యాత ఝాన్సీ వర్షాకాలంలో పాటించే ఆరోగ్య సూత్రాలను చెబుతాను

Published : 19 Aug 2020 01:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకాంక్షించారు. నటి, వ్యాఖ్యాత ఝాన్సీ వర్షాకాలంలో పాటించే ఆరోగ్య సూత్రాలను చెబుతాను అంటున్నారు. టిక్‌టాక్‌ బంద్‌ అయిన తర్వాత అందరూ ఇన్‌స్టా రీల్స్‌పై పడ్డారు. అలా ఓ సరదాగా వీడియోను చేసి లాస్య పంచుకున్నారు. పైరింగ్స్‌ పెట్టుకుని దిగిన స్టన్నింగ్‌ ఫొటోను సమంత అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. సుమ తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. సితార తన స్నేహితురాలితో ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘బిగ్‌బుల్‌’లో ఇలియానా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో ఇలియానాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అభిషేక్‌ షేర్‌ చేశారు. ఇలా తాజాగా మన సినీ సెలబ్రిటీలు ఏయే పోస్టులు పంచుకున్నారో చూసేద్దామా!

 












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని