Tokyo Olympics: పతకం సాధించారు.. చరిత్ర సృష్టించారు..

భారత హాకీ జట్టు చరిత్ర తిరగరాసింది. 41ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో పతకం సాధించింది.  టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో కోట్ల మంది కల సాకారం చేస్తూ కాంస్య పతకం సాధించింది. దీంతో భారత హాకీ జట్టుపై పలువురు సినిమా తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Published : 05 Aug 2021 22:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత హాకీ జట్టు చరిత్ర తిరగరాసింది. 41ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో పతకం సాధించింది.  టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో కోట్ల మంది కల సాకారం చేస్తూ కాంస్య పతకం సాధించింది. దీంతో భారత హాకీ జట్టుపై పలువురు సినిమా తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. నటి అక్కినేని సమంత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది. టీమ్‌ ఇండియా ఆటగాళ్లు గెలుపు సంబరాలు చేసుకుంటున్న ఫొటోను షేర్‌ చేసిందామె. అందులో 41ఏళ్ల తర్వాత అంటూ రాసుకొచ్చింది. మరో నటి ఖుష్భూ కూడా ఓ ట్వీట్‌ చేసింది. ‘‘భారత్‌కు చారిత్రక క్షణం ఇది. మనకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది’’ అని పేర్కొంది. ఇంకా ఎవరెవరు ఏం అన్నారంటే..

‘‘41ఏళ్ల తర్వాత మన భారత పురుషుల జట్టు కథను తిరగరాసింది. పతకం తీసుకొచ్చింది. ఇందులో భాగస్వామ్యమైన క్రీడాకారులందరికీ అభినందనలు’’. - కమల్‌హాసన్‌

‘‘నాలుగు దశాబ్దాల తర్వాత పతకం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఇలాగే ముందుకు సాగుతూ ఉండండి’’ - వరుణ్‌తేజ్‌

‘‘ఇండియన్‌ మెన్స్‌ హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. చరిత్ర సృష్టించి దేశానికి గర్వకారణమయ్యారు. దాదాపు 41ఏళ్ల తర్వాత హాకీలో ఒలింపిక్స్‌ పతకం తీసుకొచ్చారు.’’ - ఐశ్వర్యరాజేశ్‌

‘‘వెల్‌డన్‌ టీమ్‌ ఇండియా. 41ఏళ్ల తర్వాత మళ్లీ పతకం గెలిచారు’’ - ఆర్య

‘‘టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని ఓడించి కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు అభినందనలు. మీరు దేశం గర్వపడేలా చేశారు. శ్రీజేష్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కీలక సమయంలో అద్భుతమైన ప్రదర్శన చేశారు’’ - మమ్ముట్టి

‘‘మా హృదయాలు నీలిమయమయ్యాయి. భారత హాకీ జట్టుకు అభినందనలు. చివరి 15 సెకన్లలో ప్రత్యర్థిని అడ్డుకొని దేశానికి విజయం అందించిన కేరళ వాల్‌(గోడ) శ్రీజేశ్‌కు ప్రత్యేక అభినందనలు’’ - నవీన్‌ పాలీ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని