లావణ్య సాంగ్‌ అదుర్స్‌.. వరుణ్‌తేజ్‌ అరుదైన ఫొటో

మణిరత్నం దర్శకత్వంలో అరవిందస్వామి-మనీషా కొయిరాలా జంటగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘బొంబాయి’. ఇందులోని పాటలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా

Published : 02 Sep 2020 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మణిరత్నం దర్శకత్వంలో అరవిందస్వామి-మనీషా కొయిరాలా జంటగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘బొంబాయి’. ఇందులోని పాటలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా ‘కన్నానులే కలయికలు’ పాట ఎవర్‌గ్రీన్‌. ఆ పాటకు కథానాయిక లావణ్య త్రిపాఠి మళ్లీ ఆడిపాడారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘కేజీయఫ్‌’ నటుడు యశ్‌-రాధిక పండిట్‌లకు ఇటీవల ఓ కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా అతడికి ‘యతర్వ్‌ యశ్‌’ అని పేరు పెట్టారు. అంటే ‘సంపూర్ణమైన వ్యక్తి’ అని అర్థమట. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను యశ్‌ అభిమానులతో పంచుకున్నాడు. వినాయక నిమజ్జన వేడుకల్లో బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ పాల్గొన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి చేసిన సందడి వీడియో షేర్‌ చేశారు. సాయితేజ్‌ హెయిర్‌స్టైల్‌ అంటే వరుణ్‌కు ఎంతో ఇష్టమట. చిన్నప్పుడు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను వరుణ్‌ పంచుకున్నారు. ఇలా తాజాగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు చూసేయండి.














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని