నీళ్లలో నిప్పు.. జిమ్‌లో సుధీర్‌.. మ్యూజిక్‌ ఏదైనా..

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ

Updated : 08 Dec 2022 17:40 IST

* ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన షాట్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ‘నీళ్లలో నిప్పు’ అంటూ రామ్‌చరణ్‌పై తీస్తున్న షాట్‌ను షేర్‌ చేసింది.

* శరీరకంగా దృఢంగా ఉండేందుకు నటుడు సుధీర్‌బాబు జిమ్‌లో ఎంతో కష్టపడుతుంటారు. తాజాగా ఆయన పంచుకున్న వీడియో చూస్తే, ఆశ్చర్యపోవాల్సిందే!

* మాస్క్‌లేకుండా షూటింగ్‌కు వెళ్తుంటే భలేగా ఉండేదని కథానాయిక శ్రియ అన్నారు. అద్దం ముందు నిలబడి చిరునవ్వులు చిందిస్తున్న ఆనాటి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* నటి నందిత శ్వేత తాబేలుతో ఆడుకుంటూ తెగ సంబరపడిపోయారు. తాజాగా ఆ వీడియోను పంచుకున్నారు.

* బాలీవుడ్‌ అందాల తార దీపిక పదుకొణె ఓ ఫన్నీ వీడియోను పంచుకున్నారు. మ్యూజిక్‌ ఏదైనా గర్భా నృత్యం చేసే మీ స్నేహితురాలిని కనుగొనండి అంటూ... హితేషి అనే డ్యాన్సర్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని