
Social look: వినాయకచవితి స్పెషల్.. సినీతారల ఆసక్తికర పోస్టులు
* వినాయకచవితి సందర్భంగా తమ అభిమానులకు సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇంట్లో జరుపుకొన్న చతుర్థి వేడుకల ఫొటోలను పంచుకున్నారు. మంచు విష్ణు, యశ్, తమన్నా, విష్వక్‌సేన్, కరీనా కపూర్ తదితరులు వారి కుటుంబంతో ఫొటోలు దిగారు.
* నటి, ఎమ్మెల్యే రోజా, సెల్వమణిల కుమార్తె అన్షు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఫొటోలను రోజా అభిమానులతో పంచుకున్నారు.
* నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద త్వరలో వెండితెరపై సందడి చేయనున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో తళుక్కున మెరవనున్నారు. చిన్మయి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.
* వినాయకుడి ప్రతిమలతో దిగిన ఫొటోలను నటుడు సోనూసూద్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలను చూసేయండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.