Social Look: అనుపమ అలక.. తగ్గేదే లే అంటున్న శేఖర్‌ మాస్టర్‌..

సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు

Published : 12 Sep 2021 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారాంతాల్లో కొందరు తారలు చిత్రీకరణల్లో బిజీగా ఉంటే, మరికొందరు సోషల్‌ మీడియా వేదికపై అలరిస్తున్నారు. సారా అలీఖాన్‌ ప్రకృతిలో సేదతీరుతూ ఫొటోకి ఫోజివ్వగా.. తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్‌తో ఉన్న ఫొటోను శేఖర్‌ మాస్టర్‌ పంచుకున్నారు. మరికొందరు తారలు రీల్స్‌తో ఇన్‌స్టాలో సందడి చేశారు.

*ప్రొఫెసర్‌ భాస్కర్‌: మనీహైస్ట్‌ వెబ్‌సిరీస్‌ ఐదో సీజన్‌ రాకతో సందడి మొదలైన విషయం తెలిసిందే. తెలుగులోనూ అలరిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ తెలుగు ప్రేక్షకులను ఆకర్షించేందుకు డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ ప్రమోషనల్‌ వీడియోను రూపొందించింది. ఆ ఫోటోను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకున్నారు తరుణ్‌ భాస్కర్‌. 

*అనుపమ అలక: మలయాళీ చిన్నది అనుపమ పరమేశ్వరన్‌ ఎవరి మీదో అలిగినట్లుంది. ఎవరి వంకో కోపంగా చూస్తున్న తన ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిందీ భామ. ముక్కుపుడకతో, ముక్కు మీద కోపంతో చూసేందుకు ముద్దుగా ఉందీ కేరళ కుట్టి.

*నల్ల కలువలు:  శ్రద్దాదాస్‌, రష్మీ, సిమ్రాన్‌ చౌదరి నల్లని దుస్తుల్లో హాట్‌హాట్‌గా దర్శనమిచ్చారు. వేర్వేరు ఫోజులతో ఇన్‌స్టాలో వారికి సంబంధించిన చిత్రాలను పోస్ట్‌ చేశారు.  ఇలా మన తారలు పంచుకున్న మరికొన్ని సోషల్‌ కబుర్లేంటో చూసేయండి..















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని