తమన్నా మీసం కష్టాలు.. అషు అల్లరి.. పరిణీతి శ్రమ

నటి ప్రగతి తన కుమార్తె కలిసి చేసిన ఫన్నీ వీడియోను అభిమానులతో

Updated : 08 Dec 2022 16:41 IST

* నటి ప్రగతి తన కుమార్తెతో కలిసి చేసిన ఫన్నీ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

* రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చెర్రీ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను చూసిన చరణ్ సతీమణి ‘రామ్‌ నాకు నువ్వు నిజంగా రాముడిలా కనిపిస్తున్నావు’ అని అన్నారు.

* నటి అషురెడ్డి డబ్‌స్మాష్‌ వీడియో చేశారు. ‘జాతిరత్నాలు’లోని ఓ ఫన్నీ సీన్‌కు తనదైన హావభావాలు జోడించి అభిమానులతో పంచుకున్నారు.

* బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైనా’లో పరిణీతి చోప్రా టైటిల్‌ రోల్‌పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం తాను ఎంత కష్టపడిందో ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

* కథానాయిక తమన్నా ఓ యాడ్‌ షూట్‌లో భాగంగా మీసాలు పెట్టుకునేందుకు పడిన కష్టాన్ని పంచుకున్నారు.

* నటి అనసూయ ‘ఖిలాడీ’ షూట్‌లో భాగంగా ఇటలీ వెళ్లారు. అక్కడ రవితేజ, ఇతర చిత్ర బృందతో కలిసి తీసుకున్న జ్ఞాపకాలను షేర్ చేశారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని