‘సీఎం గారు.. త్వరగా కోలుకోవాలి’ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయం తెలియడంతో సినిమా ప్రముఖులు ట్విటర్‌ వేదికగా స్పందిస్తు్న్నారు.

Published : 20 Apr 2021 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయం తెలియడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా స్పందిస్తున్నారు. ‘సీఎం కేసీఆర్‌ గారు.. త్వరగా కోలుకోవాలి’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. కరోనాను నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.  - చిరంజీవి

కేసీఆర్‌ గారు తొందరగా కోలుకోండి సర్‌. మీకోసం ప్రార్థిస్తున్నాను. - మహేశ్‌బాబు 

కేసీఆర్‌ గారు త్వరగా కోలుకోవాలి. - తమన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనాబారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. - బండ్ల గణేశ్‌

మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నా. - శ్రీను వైట్ల

కేసీఆర్‌గారు త్వరగా కోలుకోండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. - శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌(నిర్మాణ సంస్థ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని