Published : 03 Jul 2022 15:20 IST

Tollywood: ఐటెమ్‌ సాంగ్‌లో అంజలి‌.. సాయిపల్లవి కొత్త సినిమా ఎప్పుడంటే..?

హైదరాబాద్‌: ‘బ్లాక్‌బస్టర్‌.. బ్లాక్‌బస్టరే’ అంటూ గతంలో అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్‌ చేసి అలరించారు నటి అంజలి(Anjali). ‘సరైనోడు’ (Sarrainodu) చిత్రంలోని ఈ పాట అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ అంజలి స్పెషల్‌ సాంగ్‌తో తెలుగువారిని అలరించనున్నారు. నితిన్‌ (Nithiin) హీరోగా తెరకెక్కుతోన్న ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) చిత్రంలో అంజలి ఐటెమ్‌ సాంగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ఓ పోస్టర్‌ షేర్‌ చేసింది. ఈ పాట విశేషాలను సోమవారం తెలియజేయనున్నట్లు చెప్పింది. పొలిటికల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాయిపల్లవి కొత్త సినిమా..!

‘విరాటపర్వం’ (Virataparvam) తర్వాత సాయిపల్లవి (Sai Pallavi) నుంచి వస్తోన్న చిత్రం ‘గార్గి’ (Gargi). గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకుడు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రమిది. న్యాయం కోసం ఓ మహిళ చేసే పోరాటం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతోన్నట్లు ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని జులై 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని