Updated : 02 Apr 2022 10:55 IST

Ugadi: శుభకృత్‌.. అన్నీ శుభాలే జరగాలి: చిరంజీవి

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సినీ తారలు

హైదరాబాద్‌: శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ అన్నీ శుభాలే జరగాలని అగ్రకథానాయకుడు చిరంజీవి కోరుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం సోషల్‌మీడియా వేదికగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు మోహన్‌బాబు, కీర్తిసురేశ్‌, శ్రీనువైట్ల, సుధీర్‌బాబు, అజయ్‌దేవ్‌గణ్‌.. ఇలా పలువురు సినీ ప్రముఖులు నెట్టింట వేదికగా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘శ్రీ శుభకృత్‌ నామ ఉగాది శుభాకాంక్షలు! ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను’’ - చిరంజీవి

‘‘మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’’ - తారక్‌

‘‘శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, అంటే ఉగాది. ఈ ఉగాది నుంచైనా మనందరికీ మంచి జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. "శ్రీ శుభకృత్" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’’ - మోహన్‌బాబు

‘‘ఈ అపూర్వమైన రోజు మీ, మీకుటుంబసభ్యులందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నా’’ - కీర్తిసురేశ్‌

‘‘ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రేమ, ఆప్యాయతలతో వెలుగులు నిండాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు’’ - అజయ్‌ దేవ్‌గణ్‌







Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts