Citadel: ‘సిటడెల్‌’ విడుదల ఖరారు.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్రియాంక చోప్రా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అంటే?

Updated : 08 Mar 2023 14:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌ మడెన్‌, ప్రియాంక చోప్రా (priyanka chopra) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’ (Citadel). తాజాగా ఈ సిరీస్‌ విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్‌ 28 నుంచి ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్లు విడుదల చేసింది. ఇంగ్లిష్‌, హిందీ, తమిళ్‌, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతుందని వెల్లడించింది. ఇదే పోస్టర్‌ను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేస్తూ ‘గతాన్ని గుర్తుపెట్టుకోండి.. భవిష్యత్తును రక్షించుకోండి’ అంటూ ప్రియాంక చోప్రా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. ఈ సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో వరుణ్‌ధావన్‌, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు