కలర్‌ ఫొటో టీజర్‌ చూశారా!

ప్రేమ.. స్నేహం చర్మం రంగుతో ముడిపడి ఉండవు అంటోంది ‘కలర్‌ ఫొటో’ చిత్రబృందం. ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. నటుడు విజయ్‌ దేవరకొండ ఈ టీజర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. చిత్రబృందాన్ని అభినందించారు. కమెడీయన్‌ సుహాస్‌ హీరోగా

Updated : 28 Nov 2023 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమ.. స్నేహం చర్మం రంగుతో ముడిపడి ఉండవు అంటోంది ‘కలర్‌ ఫొటో’ చిత్రబృందం. ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. నటుడు విజయ్‌ దేవరకొండ ఈ టీజర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. చిత్రబృందాన్ని అభినందించారు. కమెడీయన్‌ సుహాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్‌. నటుడు సునీల్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. యూట్యూబ్‌లో బాగా పాపులర్‌ అయిన సందీప్‌ రాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రాజేశ్‌ నీలమ్‌, బెన్నీ ముప్పనేని నిర్మాతలు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాల భైరవ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.

నల్లగా ఉండే ఓ అబ్బాయి.. తెల్లగా ఉండే గొప్పంటి అమ్మాయిని ప్రేమిస్తే వచ్చే సమస్యలేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడే కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. పల్లెటూరు వాతావరణంలో ప్రేమ, స్నేహం నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ టీజర్‌లో ‘‘నాలా నల్లగా ఉన్నోడు అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కనుండే ఫ్రెండ్సే ఎగతాళి చేస్తారు’’అంటూ హీరో సుహాస్‌ అమాయకంగా చెప్పే డైలాగ్‌ బాగుంది. అలాగే ‘‘మీరు బాగా ప్రేమించినోళ్లు చనిపోయారు. శవం పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. అక్కడికి ఒక పులి వచ్చింది. మీరు ఏం చేస్తారండి?’’ అని సునీల్‌ అడిగితే పారిపోతామండి అనే సమాధానం వస్తుంది. వెంటనే చెప్పు.. ప్రేమ గొప్పదా? భయం గొప్పదా?’’అంటూ సునీల్‌ కోపంగా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు