The Warriorr: ‘కలర్‌’ఫుల్‌ పాటతో సందడి చేస్తోన్న ‘వారియర్‌’

ఎల్లో ఓణి వేసిన రాగిణి కోసం తిరిగి నలిగిపోయాడు ఆంటోనీ.. రెడ్ రోజ్‌ పెట్టి రూపిణి కోసం లూజ్‌ అయిపోయాడు శివమణి.. అంటూ రంగులనుద్దేశించిన గీతాన్ని ఆలపించాడు ‘వారియర్‌’.

Published : 07 Jul 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎల్లో ఓణి వేసిన రాగిణి కోసం తిరిగి నలిగిపోయాడు ఆంటోనీ.. రెడ్ రోజ్‌ పెట్టి రూపిణి కోసం లూజ్‌ అయిపోయాడు శివమణి.. అంటూ రంగులనుద్దేశించిన గీతాన్ని ఆలపించాడు ‘వారియర్‌’. వారంతా ఎవరు? ఆయనకు ఏమవుతారు? రంగుల గురించి ఎందుకు వర్ణించారు? తెలియాంటే ‘ది వారియర్‌’ (The Warriorr) సినిమా చూడాల్సిందే. రామ్‌ (Ram Pothineni) హీరోగా తమిళ దర్శకుడు లింగు స్వామి తెరకెక్కించిన చిత్రమిది. జులై 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ‘కలర్స్‌’ (Colours) పాటను చిత్ర బృందం విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, జస్ప్రీత్‌ గానం, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సాహిత్యానికి తగ్గట్టు ఈ గీతాన్ని చాలా కలర్‌ఫుల్‌గా తెరకెక్కించినట్టు లిరికల్‌ వీడియో చూస్తే అర్థమవుతోంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌.. పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఈ సరసన కృతిశెట్టి, అక్షర గౌడ సందడి చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని