బ్రహ్మానందం చిత్రం: ఆంజనేయుని తన్మయత్వం

లాక్‌డౌన్‌ సమయంలో సినీతారలంతా కొత్త విషయాలు నేర్చుకోవడమో.. ఉన్న నైపుణ్యాన్ని అభిమానులతో పంచుకోవడమో చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా తనకున్న చిత్రకళను మరోసారి బయటపెట్టారు. ఇటీవల కరోనాపై బ్రహ్మానందం ఓ అద్భుతమైన

Published : 06 Aug 2020 00:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ సమయంలో సినీతారలంతా కొత్త విషయాలు నేర్చుకోవడమో.. ఉన్న నైపుణ్యాన్ని అభిమానులతో పంచుకోవడమో చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా తనకున్న చిత్రకళను మరోసారి బయటపెట్టారు. ఇటీవల కరోనాపై బ్రహ్మానందం ఓ అద్భుతమైన చిత్రం గీశారు. తాజాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ  సందర్భంగా ఆయన మరో చిత్రం గీశారు. ఇందులో రాముడిని ఆలింగనం చేసుకున్న ఆంజనేయుడు తన్మయత్వంతో ఆనందబాష్పాలు కారుస్తున్నట్లుగా ఉంది. రాముడికి గుడి కడుతున్న వేళ హనుమంతుడు ఇలాగే ఆనందపడుతున్నాడేమో అన్నట్లుగా కనిపిస్తోంది. బ్రహ్మానందం గీసిన ఈ చిత్రానికి నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. చిత్రం అద్భుతంగా ఉంది.. మీలో గొప్ప ప్రతిభ ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని