Taapsee: లక్ష్మీదేవి నెక్లెస్‌ వివాదం.. తాప్సీపై కేసు నమోదు

విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు నటి తాప్సీ (Taapsee). ఇటీవల ఆమె చేసిన ఓ పని వివాదానికి దారి తీసింది. దీంతో ఆమెపై కేసు నమోదైంది.

Updated : 29 Mar 2023 09:24 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) పై కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య గౌర్‌ తాప్సీపై ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో ఆమె లక్ష్మీదేవి నెక్లెస్‌ను ధరించడాన్ని తప్పుబట్టిన ఆయన.. ఈ మేరకు పోలీసులకు కంప్లెయింట్‌ చేశారు. ఓ మతాన్ని కించపరిచేలా తాప్సీ వ్యవహరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

అసలేమైందంటే..!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ (Taapsee Pannu) ఇటీవల లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నారు. మార్చి 12న ముంబయి వేదికగా జరిగిన ఈ షోలో ఆమె శరీరం కనిపించేలా ఎర్రని గౌను ధరించి.. దానికి అనుగుణంగా ఓ ఖరీదైన బంగారపు నెక్లెస్‌ను మెడలో వేసుకున్నారు. అయితే, ఆ నెక్లెస్‌పై లక్ష్మీదేవి డిజైన్‌ ఉండటం వివాదానికి కారణమైంది. అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి లక్ష్మీదేవి నెక్లెస్‌ వేసుకోవడం పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాప్సీ డ్రెస్సింగ్‌ పట్ల అసహనం వ్యక్తం చేసిన ఏకలవ్య గౌర్‌.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఓ మతాన్ని అవమానించేలా తాప్సీ ప్రవర్తించారని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని