నాకు చెప్పకుండా ఎవ్వరూ బయటకు వెళ్లకూడదు!

కరోనా వైరస్‌ ప్రతిఒక్కరి కుటుంబంలో ఎన్నోరకాల ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని చిత్రంగా రూపొందించి ప్రేక్షకులకు అందిస్తున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. అనుబంధం, అప్యాయత, సంతోషాలతో నిండిన కుటుంబంలో కరోనావైరస్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తితే..

Published : 02 Dec 2020 13:48 IST

వీడియో రిలీజ్‌ చేసిన ఆర్జీవీ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రతిఒక్కరి కుటుంబంలో ఎన్నోరకాల ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని చిత్రంగా రూపొందించి ప్రేక్షకులకు అందిస్తున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. అనుబంధం, అప్యాయత, సంతోషాలతో నిండిన కుటుంబంలో కరోనావైరస్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తితే.. కుటుంబసభ్యులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే విషయాన్ని తెలియజేస్తూ తెరకెక్కిన చిత్రం ‘కరోనా వైరస్‌’. అగస్త్య మంజూ దర్శకత్వం వహించారు.

శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సరికొత్త ట్రైలర్‌ను ఆర్జీవీ బుధవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘కరోనా వైరస్‌.. ఎప్పుడు, ఎక్కడ, ఎవర్నుంచి వస్తుందో తెలియడం లేదు. కాబట్టి, నాకు చెప్పకుండా ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లేది లేదు’ అంటూ శ్రీకాంత్‌ చెప్పిన డైలాగ్‌లు.. లాక్‌డౌన్‌ సమయంలో కొవిడ్‌-19 పట్ల ప్రజలు పడిన భయాన్ని తెలియజేసేలా ఉంది. ఈసినిమా ట్రైలర్‌ని విడుదల చేస్తూ.. లాక్‌డౌన్‌ తర్వాత విడుదల కానున్న మొదటి సినిమా ‘కరోనా వైరస్‌’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ మేరకు డిసెంబర్‌ 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని