‘ఖిలాడి’ దర్శకుడు రమేష్‌ వర్మకి కరోనా

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ నడుస్తోంది. మనదేశంలోనూ కేసులు రోజుకురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇక చిత్రసీమ రంగాన్ని తీసుకుంటే ఇప్పటికే చాలామంది ప్రముఖులు కొవిడ్‌ భారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఖిలాడి’ చిత్ర దర్శకుడు రమేష్‌ వర్మ కోవిడ్‌ భారినపడ్డారు.

Published : 20 Apr 2021 14:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ నడుస్తోంది. మనదేశంలోనూ కేసులు రోజుకురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇక చిత్ర రంగాన్ని తీసుకుంటే ఇప్పటికే చాలామంది ప్రముఖులు కొవిడ్‌ బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఖిలాడి’ చిత్ర దర్శకుడు రమేష్‌ వర్మకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు.

 ‘‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను స్వీయనిర్భంధంలో ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ దరించండి. అత్యవసర పనులకు మినహాయించి బయట తిరగకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న ‘ఖిలాడి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలు. పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని