Ramcharan: వామ్మో.. అనిపిస్తున్న RC15 పాట బడ్జెట్‌...!

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ పాటకోసం ఎప్పుడూ లేనంత భారీగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. 

Published : 17 Nov 2022 01:06 IST

హైదరాబాద్: రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. RC15గా ఈ చిత్రం ప్రచారంలో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటలకు కూడా భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో రూ.8 కోట్లతో ఓ పాట చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఫిల్మినగర్‌లో చక్కర్లు కొడుతోంది. అది విని చరణ్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇంతకి ఆ వార్త ఏమిటంటే... ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ పాటను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారట.

ఈ పాటను నవంబర్ 20 నుంచి డిసెంబర్‌ 2 వరకు దాదాపు రెండు వారాలు చిత్రీకరించనున్నారు. రూ.15 కోట్లతో న్యూజిల్యాండ్‌లో ఈ పాటను షూట్‌ చేయనున్నారని టాక్‌. మాములుగానే శంకర్‌ సినిమాలోని పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయి. గతంలో జీన్స్‌ సినిమాలోని ‘పువ్వుల్లో దాగున్న..’ సాంగ్‌, అపరిచితుడు సినిమాలోని ‘ఓ సుకుమారి..’ ఇలా ప్రతి సినిమాలో శంకర్‌ ఓ పాటను అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీస్తారు. ఇప్పుడు రామ్‌ చరణ్‌, కియారా అడ్వాణీల ఈ పాట కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మాతగా రానున్న ఈ బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలకపాత్రలు పోషించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని