థర్డ్‌వేవ్‌పై సందేహాలా..? ఈ వీడియో చూసేయండి

కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న మెసేజ్‌లు ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Published : 04 Jul 2021 01:37 IST

డాక్టర్‌ శివరంజనీసంతోష్‌తో నటుడు నాని ఇంటర్వ్యూ

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న మెసేజ్‌లు ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభకానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడిపోయారు. అందరూ నేరుగా వెళ్లి వైద్యులు, నిపుణుల సలహాలు తీసుకోవడం కొంచెం కష్టమే. ఈక్రమంలోనే అందరి సందేహాలు నివృత్తి చేయాలన్న ఉద్దేశంతో టాలీవుడ్‌ కథానాయకుడు నాని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ వైద్యురాలు శివరంజని సంతోష్‌తో ముఖాముఖి ఏర్పాటు చేశారు. కరోనాపై ఎలా పోరాడాలి అనే విషయాలను ఒక వీడియో రూపంలో పంచుకున్నారు. ఆమె ఏం చెప్పారో అవన్నీ ఆమె మాటల్లోనే..

‘‘తొలుత థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అన్నారు. కానీ.. ఆ తర్వాత చేసిన పరిశోధనల్లో ‘వైరస్‌ ఇప్పటిలాగే ప్రవర్తిస్తే గతంలో ఉన్న ప్రభావం మాత్రమే ఉండే అవకాశం ఉంది’ అని తేలింది. ప్రస్తుతం కరోనా వచ్చినా వందలో ఒక్కరిద్దరూ మాత్రమే ఆసుపత్రిలో చేరుతున్నారు. మిగితా వాళ్లంతా ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకొని కోలుకుంటున్నారు. ఒకవేళ ఇంతకంటే తీవ్రంగా థర్డ్‌వేవ్‌ వచ్చినా.. వందకు 5మంది కంటే ఎక్కువగా ఆసుపత్రిలో చేరే అవకాశం లేదు. ముఖ్యంగా మనం ఆందోళన చెందడం వల్ల ఎటువంటి లాభం లేదు. అవగాహన కల్పించుకొని సిద్ధంగా ఉండాలి. అందరూ టీకాలు వేయించుకోవాలి. వ్యాక్సిన్‌ వేయించుకున్నా సరే జాగ్రత్తలు మాత్రం పాటించాలి. మాస్కులు పెట్టుకోవాలి. గుంపులుగా ఉండటం మానుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 5సంవత్సరాలలోపు పిల్లలకు మాస్క్‌ పట్టడానికి బదులుగా వాళ్లను ఇంట్లోనే ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ముఖ్యంగా ప్రథమ చికిత్సపై అందరు అవగాహన తెచ్చుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు నోట్లో థర్మామీటర్‌ పెట్టవద్దని వైద్యులను కోరాలి. ఓఆర్‌ఎస్‌లో చాలా రకాలున్నాయి. కాబట్టి.. కొనేటప్పుడు డబ్ల్యూహెచ్‌వో రికమండ్‌ చేసిన ఓఆర్‌ఎస్‌నే తీసుకోండి’’ అని శివరంజనీ అన్నారు.

ఇంకా.. ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ దిగువన ఉన్న వీడియో చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని