Sonusood: ఆమెను కాపాడతాననుకున్నా కానీ..!
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఉద్వేగానికి లోనయ్యారు. కొవిడ్‌తో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడడానికి తాను ఎంతో ప్రయత్నించినప్పటికీ చివరికీ విషాదమే మిగిలిందని ఆయన తెలిపారు....
ఉద్వేగానికి లోనైన నటుడు
ముంబయి: బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఉద్వేగానికి లోనయ్యారు. కొవిడ్‌తో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడడానికి తాను ఎంతో ప్రయత్నించినప్పటికీ చివరికీ విషాదమే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఓ ట్వీట్ పెట్టారు. ‘కొవిడ్‌తో తీవ్ర పోరాటం చేస్తోన్న భారతి అనే యువతిని ఇటీవల నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించిన విషయం అందరికీ తెలిసిందే. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందింది. నెల రోజులపాటు ఆసుపత్రిలో ఆమె జీవితంతో పోరాటం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను ఆమెను బతికిస్తాననుకున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. నా హృదయం ముక్కలైంది’’ అని సోనూసూద్ అన్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన భారతి అనే యువతి ఇటీవల కరోనా బారిన పడింది. వైరస్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు 85 శాతం వరకూ దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స అందించాలని వైద్యుల సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ.. భారతి కోసం ఓ ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Toll Gate: గేటు తీయడం ఆలస్యమైందని.. టోల్ ఉద్యోగి హత్య
-
Movies News
Siddharth: ఒంటరిగా పోరాడలేకపోతున్నా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: సిద్దార్థ్
-
Viral-videos News
viral videos: చిన్నారులుగా దేశాధినేతలు.. ఏఐ మాయ చూస్తారా..?
-
Movies News
‘హీరోలతో కలిసి భోజనం.. కాలర్ పట్టుకుని లాగేశారు’: బీటౌన్ ప్రముఖ నటుడు
-
World News
Kremlin: రష్యా రేడియోలు హ్యాక్.. పుతిన్ పేరిట నకిలీ సందేశం ప్రసారం!
-
Movies News
Mahesh Babu: వేడుకలో మహేశ్‌బాబు సందడి.. ఆ ఫొటోలకు నెటిజన్లు ఫిదా!