TeluguCinema: మ్యూజికల్ కాంబినేషన్ మారింది..!
టాలీవుడ్లో హీరో- హీరోయిన్, హీరో- డైరెక్టర్ కాంబినేషన్లకే కాదు డైరెక్టర్- మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్‌కీ మంచి క్రేజ్ ఉంటుంది. కొరటాల శివ- దేవి శ్రీ ప్రసాద్, శ్రీకాంత్ అడ్డాల- మిక్కీ జె. మేయర్, శివ నిర్వాణ- గోపీ సుందర్ కాంబోలు అలాంటివే. ఇప్పటి వరకు కొరటాల చిత్రాలన్నింటికీ దేవి, శ్రీకాంత్ అడ్డాల సినిమాకి మిక్కీ, శివ నిర్వాణ మూవీస్‌కి గోపీసుందర్ సంగీతం అందించారు.
టాలీవుడ్లో హీరో- హీరోయిన్, హీరో- డైరెక్టర్ కాంబినేషన్లకే కాదు డైరెక్టర్- మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్‌కీ మంచి క్రేజ్ ఉంటుంది. కొరటాల శివ- దేవి శ్రీ ప్రసాద్, శ్రీకాంత్ అడ్డాల- మిక్కీ జె.మేయర్, శివ నిర్వాణ- గోపీ సుందర్ కాంబోలు అలాంటివే. ఇప్పటివరకు కొరటాల చిత్రాలన్నింటికీ దేవి, శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు మిక్కీ, శివ నిర్వాణ మూవీస్‌కి గోపీ సుందర్ సంగీతం అందించారు. అవన్నీ మ్యూజికల్‌గా మంచి హిట్ అయ్యాయి. అయితే ‘బట్ ఫర్ ఏ ఛేంజ్’ అనుకున్నారో! ఆయా సంగీత దర్శకుల డేట్స్ సర్దుబాటు కాలేదో కానీ ఈ ముగ్గురు దర్శకులూ తమ కొత్త చిత్రాలకి ఇతర సంగీత దర్శకుల్ని ఎంపిక చేసుకున్నారు. అవేం సినిమాలు, ఆ సంగీత దర్శకులెవరో తెలుసుకుందామా..!
దేవి టు మణిశర్మ..
కొరటాల శివ- దేవి శ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. దేవి అందించిన నేపథ్య సంగీతం కొరటాల కథల్ని మరోస్థాయికి తీసుకెళ్లిందనడంలో అతిశయోక్తి లేదు. అంతలా తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారాయన. కొరటాల చిత్రాలకు దేవి స్వరపరిచిన ప్రతి పాటా శ్రోతల్ని ఉర్రూలూగించింది. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్‌కి బ్రేక్ వచ్చింది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ‘లాహే లాహే’ పాట విశేషంగా ఆకట్టుకుంది. మరి మణిశర్మతో కొరటాల ఇంకా ఎలాంటి పాటలు రాబట్టుకున్నారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తోంది. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలన్నింటికీ మిక్కీ జె. మేయర్ స్వరాలు సమకూర్చారు. ఈ కాంబినేషన్లో వచ్చిన ఆల్బమ్స్ శ్రోతల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ సారి తన కొత్త సినిమా సంగీత దర్శకుడిగా మణిశర్మకి అవకాశం ఇచ్చారు శ్రీకాంత్. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం అందుకున్న ‘అసురన్’కి రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్రానికే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కథలో భాగంగా వచ్చే పాటలు తప్ప ఐటెమ్ గీతాలు, ఫాస్ట్బీట్లు, మెలొడీలు ఇందులో ఉండవు. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రధాన బలం. బీజీఎమ్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) ఇవ్వడంలో మణిశర్మకి మంచి పేరుంది. మరి ఈసారి మణిశర్మ ఏం రేంజ్లో బీజీఎం ఇస్తారో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియమణి, ప్రకాశ్ రాజ్, కార్తీక్ రత్నం, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రానుంది. శ్రీకాంత్ గతంలో తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి మణిశర్మనే బీజీఎం అందించారు.
వాటికి గోపీ సుందర్.. ‘జగదీష్’కి తమన్
‘నిన్నుకోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన కథల్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మాయ చేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ రెండు సినిమాలకు గోపీ సుందర్ అందించిన పాటలు శ్రోతల్ని హత్తుకున్నాయి. తన మూడో చిత్రానికి తమన్‌కి అవకాశం ఇచ్చారు శివ. నాని హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం అద్భుతమని ఇప్పటికే విడుదలైన ‘కోలో కోలన్న’, ‘ఇంకోసారి’, ‘నీటి నీటి సుక్కా’ పాటలు నిరూపించాయి. షైన్ స్ర్కీన్స్ సంస్థ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు